‘పులివెందుల’ మనోభావాలపై వ్యాఖ్యలా..!
1 min readపవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి..
– పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్
పల్లెవెలుగు వెబ్, పులివెందుల: ఉమ్మడి, ప్రస్తుత రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాంతం.. పులివెందుల అని, అలాంటిది ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు లేదని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలోపవన్ కల్యాణ్ పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడారని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ గోపినాథ్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం స్థానిక వైయస్ మనోహర్ రెడ్డి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ సభ్యులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు.