ఏలూరు చేపల మార్కెట్ ను సందర్శించిన కమిషనర్
1 min read
నగరంలో సుడిగాలి పర్యటన..పారిశుధ్య నిర్మూలన మనందరి బాధ్యత..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వ్యాపారులు రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. ఉదయం వన్ టౌన్ ప్రాంతంలోని చేపల మార్కెట్లో సుడిగాలి పర్యటన చేపటి మార్కెట్ ప్రాంతంలోనీ అన్ని షాపులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అక్కడ వ్యాపారులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పారిశుధ్య నిర్వహణకు నగరపాలకసంస్థ సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ వ్యాపారులందరూ రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన డంపును వినియోగించుకోవాలని లేదా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. రోడ్లపై చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రత మానందారి భాద్యతగా తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం దరిచేరదన్నారు. డిఈ పిలగల కొండలరావు, ఆర్ ఐ లు తదితరులు కమిషనర్ వెంట వున్నారు.