అన్న క్యాంటీన్‌లో అల్పాహార రుచి పరిశీలించిన కమిషనర్
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: గురువారం నగరంలో పరిమళ నగర్ వద్దనున్న అన్న క్యాంటీన్లో గురువారం ఉదయం నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అల్పాహార రుచిని చూశారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణాన్ని చూసిన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు రుచికర నాణ్యమైన ఆహారం అందించాలని, నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. అంతకుముందు ఆయన బండిమెట్ట, ఛత్రీబాగ్, బడపడఖాన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రహదారులపై శుభ్రత పనులు పూర్తి అయ్యాక, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అలాగే అయప్పనగర్ 89వ సచివాలయాన్ని కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వేల ప్రక్రియ వేగవంతం చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరుపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు.