పేదలకు ఉపయోగపడే వన సంరక్షణ సమితులు ఉండాలి
1 min readఅటవీ వన సంరక్షణ సమితిలలో పనిచేస్తున్న కూలీల సమస్యలు పరిష్కరించాలి..
వి ఎస్ ఎస్ లకు కటింగ్ ఆర్డర్ ఇవ్వాలి నూతన ప్లాంటేషన్లకు అనుమతులు ఇవ్వాలనీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్..
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అటవీశాఖ ఏలూరు జిల్లా రెంజర్ కార్యాలయం ముందు ధర్నా
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వన సంరక్షణ సమితిల నూతన ప్లాంటేషన్లకు అనుమతులు ఇవ్వాలని మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా రెంజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అటవీ శాఖల పరిధిలో ఉన్న ఫారెస్ట్ భూములలో పేదలు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారన్నారు. ఈ భూములలో వి ఎస్ ఎస్ ల పేరుతో గ్రామంలో ఉన్న పేదలు మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. పేదలకు ఉపయోగపడే వన సంరక్షణ సమితులు ఉండాలన్నారు. జిల్లాలో లింగపాలెం మండలంలో తోచాలక రాయుడుపాలెం, కలరాయినిగూడెం, బోగోలు, కళ్యాణ పాడు, దిబ్బగూడెం, ఉంగుటూరు గొల్లగూడెం, ఎల్లమల్లి, పెద్ద ఎల్లమల్లి, ఎర్రమళ్ళ, పెదవేగి చింతలపూడి ముసునూరు, చాట్రాయి తదితర మండలాల్లో వన సంరక్షణ సమితులు నడుపుతున్న కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కటింగ్ కు వచ్చిన ప్లాంటేషన్లకు ప్రభుత్వం వెంటనే కటింగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు భూ పంపిణీ చేయాలన్నారు. వన సంరక్షణ సమితులకు రక్షణ డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాలో పేదలు దళితులు వి ఎస్ ఎస్ లలో పని చేయడం జరుగుతుందనీ తెలిపారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వి ఎస్ ఎస్ కూలీల సమస్యలు పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సంఘం జిల్లా కమిటీ సభ్యులు దుబ్బకు దాసు, జ్యోతి, బాబురావు, వి ఎస్ ఎస్ సభ్యులు సంతోషం, ప్రసాద్, నాగేష్, వెంకటేష్, మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.