మానవ మనుగడకు దిక్సూచి.. భగవద్గీత: కె.రామారావు
1 min readపల్లెవెలుగు వెబ్ : సమస్త మానవ మనుగడకు అవసరమైన మార్గనిర్దేశం భగవధ్గీత అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి కె . రామారావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని తితిదే కళ్యాణ మండపము నందు జరిగిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మార్గనిర్దేశం చేశారు. మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఆత్మోద్దరణ గ్రంథం భగవధ్గీత అన్నారు. ఈ పోటీలను నాలుగు విభాగాలుగా చేసి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు,100 మంది ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాల్గొన్న వారందరికీ తరిగొండ వెంగమాంబ సేవాసమితి అధ్యక్షురాలు శ్రీమతి పసుపులేటి నీలిమ , లలితా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి , ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా అనంత అనిల్ కుమార్, యం.మహాలక్ష్మీ, ఎలమర్తి రమణయ్య, దేవి దయానంద్ సింగ్, నాగరత్నం శ్రేష్టి, విద్వాన్ మారేడు రాముడు, విద్వాన్ టి.గుర్రప్ప,యం లక్ష్మయ్య, జి.భానోజీరావు, యం.నాగమణి గారు ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలను హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి దుశ్శాలువాలతో సన్మానించారు.