కారుణ్య నియామకాల ఉద్యోగుల.. కుటుంబాల పరామర్శ యాత్ర
1 min read– APJAC అమరావతి, కర్నూల్ జిల్లా :
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉద్యోగ,ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల, కాంట్రాక్టు,పొరుగు సేవలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారము కొరకు APJAC అమరావతి కార్యాచరణలో భాగముగా ది. 27.03.2023 న తలపెట్టిన “కారుణ్య నియామకాల ఉద్యోగుల కోసము ఎదురుచూస్తున్న కుటుంబాల పరామర్శ యాత్ర” లో భాగముగా APJAC అమరావతి, కర్నూల్ జిల్లా శాఖ చైర్మన్ శ్రీ గిరి కుమార్ రెడ్డి , అసోసియేట్ చైర్మన్ శ్రీ నాగారమణయ్య , రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు మరియు జిల్లా కార్యవర్గ సభ్యుల ఆద్వర్యములో ప్రభుత్వ ఉద్యోగసము చేస్తూ చనిపోయిన ఉద్యోగ కుటుంబాలలో కారుణ్య నియామకము కొరకు దరఖాస్తు చేసిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడము జరిగినది. జిల్లాలోనే సుమారుగా 70 కుటుంబాల వరకు కారుణ్య నియామకములు జరగకపోవడము వలన ఇబ్బందులు పడుచున్నారని మా దృష్టి కి వచ్చినది.
వివరాలు క్రింది విధముగా 1) సహకార శాఖలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తూ 2021 మే నెలలో కోవిడ్ డ్యూటీ చేస్తూ కరోనా బారిన పడి మరణించిన ( లేట్ ) రాజశేఖర్ వారి కుటుంభ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరమర్శించడం జరిగినది. వారి భార్య గ్లోరీ కారుణ్య నియమకము. క్రింద ఉద్యోగము కొరకు దరఖాస్తు చేసారు. 2) కర్నూల్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కర్నూల్ నందు హెడ్ నర్సు గా పని చేస్తూ ది.09.10.2020 వ తేదిన అనారోగ్యముతో తో మరణించిన ( లేట్ ) శ్రీమతి హెలెన్ కుమారి వారి కుటుంబాని పరమర్శించడం జరిగినది, వారి చిన్న కుమారుడు డిగ్రీ చదివి కారుణ్య నియమకములో ఉద్యోగము కొరకు దరఖాస్తు చేసియున్నారు.3)కర్నూల్ APPTD (RTC ) నందు కండక్టరు గా పనిచేస్తూ ది.11.10.2021 వ తేదిన కోవిడ్ తో మరణించిన ( లేట్ ) నాగశేషమ్మ వారి కుటుంబాని పరమర్శించడం జరిగినది. వారి చిన్న కుమారుడు కారుణ్య నియమకములో ఉద్యోగమూ కొరకు దరఖాస్తు చేసియున్నారు. అదేవిధముగా కర్నూల్ పరిసర ప్రాంతములలో ఉన్న వివిధ బాదిత కుటుంబాలను పరామర్శించడము జరిగినది. కోవిడ్ లాంటి అత్యంత విపత్కర పరిస్థుతులలో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన ఉద్యోగుల యొక్క కుటుంబాలకు ఆసరా కల్పిస్తూ వెనువెంటనే ఆ కుటుంబములో అర్హత ఉన్న వ్యక్తికి కారుణ్య నియామకము లో ఉద్యోగము కల్పించి జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చుసుకోనవలసిన భాద్యత ఈ రాష్ట్ర ప్రభుత్వము పై ఉన్నప్పటికి గడిచిన రెండు సంవత్సరములుగా బాదిత కుటుంబాలలో ఏ ఒక్కరికి కారుణ్య నియామకము ద్వారా ఉద్యోగము కల్పించకపోవడముతో వారు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుచున్నారు. కావున ప్రభుత్వము సత్వరమే స్పందించి కోవిడ్ 1 మరియు 2 వేవ్ లలో మరియు ఇతర కారణముల వలన మరణించిన ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయ కుటుంబములలో అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి వెనువెంటనే కారుణ్య నియామకము ద్వారా ఉద్యోగములు కల్పించి బాధిత కుటుంబాలను ఆదుకొనవలెనని APJAC అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కే .వై .కృష్ణ జనరల్ సెక్రటరీ, APJAC అమరావతి, వై.నాగేశ్వర రావు డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు APJAC అమరావతి నాయకులు శంకర్ నాయక్ , రామానాయుడు, శోభాసువర్ణమ్మ అప్పరాజు లోకేశ్వరి గ్రామవార్డు సచివాలయ ప్రతాప్ ప్రశాంత్ రాముడు రామాంజనేయులు క్లాస్ 4. జిల్లా అధ్యక్షులు మద్దిలేటి మరియు RTC ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాస రావు మరియు వివిధ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
అమరావతి, ఆర్టీసి, జేఏసి, అర్హత,