కారుణ్య ద్వారా ఉపాధి.. నియమకాలు..
1 min read– కవురు శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యము పరిధిలో వివిధ కార్యాలయములలో పనిచేయుచూ మరణించిన దివంగత ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకము ద్వారా ఉపాధి కల్పించుటలో భాగముగా ఈ ఈ దిగువ తెలిపిన ఐదుగురు అభ్యర్దులకు, కవురు శ్రీనివాసు చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, ఉమ్మడి పశ్చిమ గోదావరి వారిచే నియామకపు ఉతర్వులు అందజేయడమైనది. ఈ కార్యక్రమములో సి.యి.ఓ మరియు డిప్యూటీ సి.యి.ఓ కె.వి.ఎస్.ఆర్.రవి కుమార్ పాల్గొనిన్నరు. టైపిస్టులుగా ఉపాధి కల్పించిన జాబితా అభ్యర్ది పేరు అభ్యర్దిని టైపిస్టుగా (కండీషనల్) నియమించిన స్థానము మల్లి నవిన్ కుమార్, S/o లేటు గరిక శ్వేతా మాధవి జిల్లా ప్రజా పరిషత్, ఏలూరు, పతివాడ సాయి కిశోర్, లేటు పతివాడ అప్పారావు మండల ప్రజా పరిషత్, కాళ్ళ మండలం, సంగడాల (కంపా) సుధారాణి, లేటు సంగడాల ప్రసాద్ మండల ప్రజా పరిషత్, జంగారెడ్డిగూడెం మండలం, పిల్లా సాయి రాజేష్ పిల్లా బంగారయ్య జిల్లా ప్రజా పరిషత్ ఏలూరు, ఖండవల్లి సోహన్ వికాస్, లేటు ఖండవల్లి రాజశేఖర్, మండల ప్రజా పరిషత్, ఆచంట మండలం, వారికి నియామక పత్రాలు అందించినట్లు ముఖ్య కార్యనిర్వహణాధికారి కె వి ఎస్ ఆర్ రవికుమార్ ఒక ప్రకటన తెలిపారు.