PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇద్దరి స్టార్ హీరోల మధ్య పోటీ..

1 min read

AMB కి ధీటుగా AAA సినిమాస్
సినీరంగంలో స్టార్ హీరోల మధ్య పోటీ… వారి అభిమానుల మధ్య ఆసక్తి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒకేరోజు ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవబోతున్నాయంటే బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయో.. అన్న ఆసక్తి అందరిలోను ఉంటుంది. సినిమాలు రిలీజ్‌కి ముందు నుంచే సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో చాలామంది హీరోలు సినిమాలతో పాటు నిర్మాణం రంగలో కూడా అడుగు పెట్టారు. సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి తాము నటించే సినిమాలకి భాగస్వామ్యం అవుతూనే బయట హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు – అల్లు అర్జున్ మధ్య పోటీ బాగా ఉంటోంది. గత ఏడాది సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పోటీ పడ్డారు. ఒకరి సినిమా ఇండస్ట్రీ హిట్ సాధిస్తే.. ఒకరి సినిమా బ్లాక్ బస్టర్కా బాప్‌గా నిలిచింది. అయితే సినిమాల విషయంలోనే కాకుండా థియోటర్స్ బిజినెస్‌లో కూడా మహేష్ బాబు – అల్లు అర్జున్‌ల మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు.. ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాన్‌ని ప్రారంభించాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రంగంలో తన స్టైలిష్ మార్క్‌ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్ AAA సినిమాస్ (ఏసియా అల్లు అర్జున్ సినిమాస్) ని తీసుకు రాబోతున్నాడు. అయితే మహేష్ బాబు AMB కి ధీటుగా AAA సినిమాస్ (ఏసియా అల్లు అర్జున్ సినిమాస్) ఉండబోతోందని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

About Author