యాదవుల కంచుకోట నుంచి పోటీ
1 min readపల్లెవెలుగువెబ్ : సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే స్థానం ఖరారైంది. మైన్ పురి జిల్లా కర్హాల్ నుంచి అఖిలేశ్ పోటీ చేయనున్నట్టు ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. మైన్‌పురి జిల్లా సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా నిలుస్తుండగా, మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హాల్ నియోజకవర్గంలో 1.44 లక్షల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో అఖిలేష్‌కు ఇది సురక్షితమైన సీటుగా భావిస్తున్నారు. తమ కుటుంబానికి కలిసి వచ్చిన మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఖరారు చేసుకున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ చేస్తుండటం ఇదే మొదటిసారి. 2012లో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఎమ్మెల్సీ అయ్యారు.