PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానసిక ఉల్లాసం కోసమే పోటీలు:హెచ్ అర్ మేనేజర్ నరేష్ 

1 min read

డిక్సన్ కంపెనీలో మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు

సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఉద్యోగులు

పల్లెవెలుగు వెబ్ కడప: కడప నగర శివారులోని ఇండస్ట్రియల్ పార్క్ లోని డిక్సన్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు పని ఒత్తిడిని అధిగమించేందుకు పండుగ వాతావరణంలో కార్మికుల కొరకు రంగోలి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ తో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించామని ఆ కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ నరేష్ నరేష్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మా ప్రాంగణంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి పోటీలు నిర్వహిస్తునమన్నారు. అంతేకాకుండా కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రతి నెల ఇటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నామన్నారు.ఇందులో భాగంగానే కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటిల్లో ఒక గ్రూపులో 5మంది చొప్పున 103 టీములుగా పాల్గొన్నారని. పోటీలో పాల్గొన్న గ్రూపులకు మొదటి బహుమతి, r రెండువ బహుమతి,మూడువ బహుమతులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.అలాగే ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్లో 750 పాల్గొన్నారని తెలిపారు.వీరికి కూడా మొదటి,రెండవ,మూడవ బహుమతులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.గెలుపొందిన విజేతలకు ఈనెల 20వ తేదీన బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగ అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి బల్జిత్,ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి ఓం ప్రకాష్, సుధీర్,మెయింటినెన్స్ డిపార్ట్మెంట్ నుండి రామ మోహన్,అదే విధంగా హెచ్ ఆర్ ఆఫీసర్లు మణికంఠ రెడ్డి,పీరా,ప్రవళిక, ప్రసన్న, యల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author