కొణిదేలలో హోరాహోరీగా బండలాగుడు పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం అంతరాష్ట్ర ఎద్దులు బండలాగుడు పోటీలను ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సర్పంచి కొంగర నవీన్ ముఖ్య అతిథిగా హాజరై బండలాగుడు పోటీలను ప్రారంభించారు.చిన్న బండ పోటీలో దాదాపు 13 జతల ఎద్దులు పోటీపడ్డాయి.హోరాహోరీగా జరిగిన ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన ఎద్దుల యజమానులకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న ఎద్దుల యజమానులను కమిటీ సభ్యులు శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వడ్డే రంగస్వామి, సాలె షాలన్న, సీపీఎం రాజు ,కొంగర అయ్యన్న, గ్రానెట్ కొంగర రాజు, గోగుల నాగ శేషులు, చేపల మహేశ్వర, పి.పుల్లయ్య, పర్వతాలు, బోయ నరసింహ, సిద్దయ్య ,ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.