NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారి భద్రత అవగాహన పై పోటీ పరీక్షలు

1 min read

– 34వజాతీయ రహదారి భద్రత వారోత్సవాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో ని కేంద్రీయ విద్యాలయం నందు రహదారి భద్రత అవగాహన పై పోటీ పరీక్షలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఎంపీ గారు పోటీ పరీక్షల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు అదేవిధంగా మాట్లాడుతూ దేశంలో వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యువకులు వాహనాలు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా మన ప్రాణం తో పాటు అవతల వ్యక్తి ప్రాణాలు కూడా ముఖ్యమని రోడ్డు భద్రత సిబ్బంది ఆదేశాల మేరకు తగు సూచనలు పాటించి ప్రమాదాలు జరగకుండా జీవించాలని విద్యార్థులు కూడా మీ తల్లిదండ్రులకు మీ సహచర్లకు రోడ్డు భద్రతపై చదువుకున్న వ్యక్తులుగా మీరు వాళ్లకి అవగాహన పెంచాలని అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఎంపీ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్శ్రీధర్ గారు, ఆర్టీవో రమేష్ గారు ,mvi మనోహర్ రెడ్డి ,రవీంద్ర కుమార్ గారు,కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ పి ఆంజనేయులు గారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author