కొడాలి నాని పై ఎస్పీకి ఫిర్యాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రి కొడాలి నాని పై తెలుగుదేశం నేతలు కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుడివాడలో కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహణకు సంబంధించి నాని పై చర్యలు తీసుకోవాలని కోరారు. జూదం, అసభ్య నృత్యాల నిర్వహణ ద్వార రూ. 500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని దెబ్బతీసే చర్యలను ఉపేక్షించరాదని ఎస్పీకి తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు వర్ల రామయ్య, బొండా ఉమ, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చల అర్జునుడు, కొనకళ్ల నారాయణ, రావి వెంకటేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.