NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌వ‌న్ పై పులివెందుల్లో ఫిర్యాదు

1 min read

పులివెందుల‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద వైసీపీ నాయ‌కులు పులివెందుల పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. పులివెందుల ప్రజ‌ల మ‌నోభావాలు దెబ్బతినేల వ్యాఖ్యలు చేశార‌ని ప‌ట్టణ పోలీస్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. పులివెందుల మున్సిప‌ల్ చైర్మన్ వ‌ర‌ప్రసాద్, కౌన్సిల‌ర్లతో క‌లిసి ఎస్ఐ గోపీనాథ్ కు ఫిర్యాదు చేశారు. వ‌ర‌ప్రసాద్ మాట్లాడుతూ పులివెందుల అంటే పౌరుషానికి, ప్రేమ‌కు పుట్టినిల్లని అన్నారు. ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల‌ను ఇచ్చిన ఘ‌న‌త పులివెందుల‌దేన‌న్నారు. బీజేపీ ఇచ్చిన ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పులివెందుల గురించి మాట్లాడే అర్హతలేద‌న్నారు. పులివెందుల ప్రజ‌ల‌కు బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాల‌ని వ‌ర‌ప్రసాద్ డిమాండ్ చేశారు.

About Author