ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
1 min read– ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు గుడిసె శివన్న
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఉపాధ్యాయ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ కౌంటింగ్ ఫలితాలపై యాభై శాతం పైగా ఓట్లు వస్తే గెలుపు పద్ధతిలో కాకుండా ఎవరికి వచ్చిన ఓట్లు వారికే తప్ప ఇతరులకు బదలాయింపు చేయకూడదని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు గుడిసె శివన్న సోమవారం తెలిపారు. ఓటర్లు తమ ఓటును నీతి నిజాయితీగా వేసిన అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి బదిలాయించడం అనేది ఓటర్లను పోటిలో ఉండే కొంతమంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వేరే వారికి బదలాయింపు పరోక్షంగా అమ్ముకోవడం అవుతుందని తేలిసి కూడా నీచమైన సంస్కృతిని తొలగించి పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకొనే పద్ధతి పెట్టాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు గుడిసె శివన్న తెలిపారు. ఎన్నికలలో తమకు కావలసిన అభ్యర్థులకు లేక పార్టీలకు వేసిన ఓట్లను వేరే పార్టీలకు వేరే అభ్యర్థులకు బదలాయించడం అనేది చాలా నీచమైన చర్య ఎన్నికల సంఘమే ఓట్లు అమ్మకానికి ప్రోత్సహించినట్టు అవుతుందని ఇది ఓటర్లను అభ్యర్థులు ఇతరులకు అమ్మే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది పోటీకీ వస్తూన్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల తరహాలో ఎన్నికలు జరిగేలా చూడాలని గుడిసె శివన్న ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులో గుడిసె శివన్న పేర్కొన్నారు.