ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలి
1 min readజల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వివిధ మాధ్యమాల ద్వారా ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. సోమవారం సాధారణ ఎన్నికల-2024 నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన MCMC cell, జిల్లా స్థాయి కమ్యూనికేషన్ కంట్రోల్ రూం ను తనిఖీ చేసారు..కమ్యూనికేషన్ సెంటర్ లో సంబంధిత అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంసీఎంసి సెల్ లో ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్ పరిశీలన పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు..ఇందుకు సంబంధించి రిజిస్టర్ లు నిర్వహించాలని రోజు వారీ నివేదికలను తయారుచేయాలని సూచించారు..అలాగే ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియాల్లో రాజకీయ ప్రకటనలకు MCMC అనుమతి తప్పని సరి అని కలెక్టర్ స్పష్టం చేశారు . జిల్లా కమ్యూనికేషన్ కంట్రోల్ రూం లో ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950, టోల్ ఫ్రీ నెంబర్, ల్యాండ్ లైన్ నెంబర్, వాట్సాప్ నంబర్, టీవీ స్క్రోలింగ్, సోషల్ మీడియా ల ద్వారా ఫిర్యాదులు వస్తాయని, ఫిర్యాదులు రాగానే సంబంధిత ఫార్మాట్ లలో రూపొందించి మెయిల్ ద్వారా సెక్టర్ అధికారులు, సంబంధిత ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.. కమాండ్ కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు..ప్రతి పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్ ఏ సెక్టార్ లో ఉంది, సంబంధిత సెక్టార్ ఏ నియోజకవర్గం కిందికి వస్తుందనే వివరాలు ఉండాలని, ప్రతి నియోజకవర్గం లో ఏర్పాటు చేయబడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, స్టాటిక్ సర్విలియన్స్ టీమ్, ఎక్స్పెండిచర్ టీమ్స్ తదితర వివరాలు కూడా కమ్యూనికేషన్ రూమ్ లో ఉండాలన్నారు.మొత్తంగా 220 సెక్టార్లు ఉన్నాయని, ఒకొక్క కంప్యూటర్ ఆపరేటర్ కు 10 సెక్టార్ లను కేటాయింపు చేయాలని సూచించారు..కమ్యూనికేషన్ కంట్రోల్ రూం నుండి ఫిర్యాదులకు సంబంధించి నిర్దేశించిన ఫార్మాట్ లో పంపే సమాచారాన్ని ప్రతి మండలంలో ఉండే ఎం సి సి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లకు చేరవేసే విధంగా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఫిర్యాదులను 24 గంటలలోపు పరిష్కరించాలన్నారు. సి విజిల్ లో వచ్చిన ఫిర్యాదులకు 100 నిమిషాలలో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. రోజువారీ ఏ మాధ్యమం ద్వారా ఎన్ని ఫిర్యాదులు వస్తునాయి అందులో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే వివరాలను ఎప్పటికప్పుడు మైంటైన్ చేయాలని, ఎన్నికల అబ్జర్వర్ వచ్చిన సమయంలో ప్రతి ఒక్కటి పరిశీలిస్తారన్నారు. అదే విధంగా ప్రతి రోజు ఎం సి సి, కంప్లైంట్ సెల్ కి సంబంధించిన నివేదికలు పంపాలని సిపిఓ ను అదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూధన్ రావు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.