(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) మిషన్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందు 33ల్యాబ్ లో రెండు CBP (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) మిషన్ లను ప్రారంభించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో రోగుల రద్దీ దృశ్య మూడు షిఫ్ట్ లు 24 గంటలు పనిచేసే విధంగా రెండు సి బి పి మిషన్ లను అందుబాటులోకి అమర్చినట్లు తెలిపారు.పేషంట్లలకు ఇబ్బంది కలగకుండా ఈ రిపోర్టు వల్ల పేషంట్లకు తత్వరా ట్రీట్మెంట్ అందుతున్నట్లు తెలిపారు.ఇతర రక్త పరీక్షల కోసం వచ్చే పేషెంట్లలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా రిపోర్ట్ లు అందజేయాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ మరియు నోడల్ ఆఫీసర్, డా.శివబాల నగంజన్, బయో కెమిస్ట్రీ సిబ్బంది తదితరులు. ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.