PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయండి…

1 min read

– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టరు జవహర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం విజయవాడ నుండి రీసర్వే, భూసేకరణ, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, పంచాయతీ రాజ్, జాతీయ చేనేత దినోత్సవం, వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, జగనన్న సురక్ష, వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, ఆడుదాం ఆంధ్ర తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఐదు లక్షల గృహాలు ఈనెల ఆగస్టు 20 తారీకు లోపల పూర్తి కావాలని మరియు 5 లక్షల ఇరవై వేల గృహాలు డిసెంబర్ నెల కు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇంకుడు గుంతలు, రోడ్లు మొదలగు ఏర్పాట్లలతో 100% పూర్తయి ఉండాలని ఈ గృహాలను మొదట పంచాయతీ, వార్డు, సెక్రటరీలు తనిఖీ చేయాలని, తర్వాత 20 శాతం గృహాలు ఎంపీడీవోల ద్వారా మరియు 10% మున్సిపల్ కమిషనర్లు లేదా జోనల్ అధికారుల ద్వారా తనిఖీ చేయబడి ఆగస్టు నెల 18వ తారీకు కి పూర్తి నివేదిక అందజేయాలన్నారు.రీసర్వేకు సంబంధించి రోవర్లు, డ్రోన్ల ద్వారా రీ సర్వే ప్రక్రియ రెండవ దశ జరుగుతుందని విలేజ్ సెక్రటరీలు, తహశీల్దార్లు ఎప్పటికప్పుడు వారి లాగిన్ నందు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకోవాలని తెలిపారు. 294 గ్రామాలలో సర్వే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. డ్రాఫ్ట్ ఆర్వోఆర్ కు ఫైనల్ ఆర్వో ఆర్ కు 15 రోజుల గ్యాప్ అవసరం అన్న నిబంధనలు పాటించవలసిన అవసరం లేకుండా ఎప్పటికీ ఎంత త్వరగా వీలైతే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3500 రోవర్లు అందుబాటులో ఉన్నాయని వీటితో గ్రౌండ్ ట్రూతిన్గ్, గ్రౌండ్ వాల్యుయేషన్లు పూర్తిచేసుకుని గ్రామాల సరిహద్దులు నిర్ణయించుకుని సరిహద్దు రాళ్ళను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.జాతీయ రోడ్ల నిర్మాణ సంస్థలకు ఇవ్వవలసిన భూములనూ వెంటనే అందజేయాలని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల భవనాలు వెంటనే పూర్తి చేసి వారికి అప్పగించవలసిందిగా పంచాయతీరాజ్ శాఖ వారిని ఆదేశించారు. కాలువ గట్లమీద, రోడ్డుకి ఇరువైపులా, చెరువులు మరియు కుంటలు దగ్గర చెట్లను పెంచాలని ఉద్యాన శాఖ వారిని ఆదేశించినారు.నా భూమి-నా దేశం, నేల తల్లికి నమస్కారం-వీరులకు వందనం ఈ విషయాలపై మేరీ మాటి మేరీ దేశ్ సర్కులర్ ద్వారా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది . దీని ప్రకారం ప్రతి శిలాఫలకం దగ్గర 75 మొక్కలు ( ఎంజిఎన్ఆర్ఇజిస్ పనుల ద్వారా ) నాటడం , ఆ శిలాఫలకం పై ఆ ప్రాంతంలోని స్వాతంత్ర సమరయోధులు , అమరవీరుల పేర్లు మరియు ప్రముఖుల పేర్లు ఏర్పాటు చేసే విధంగా చేసి 13 ఆగస్టు నాటికి అందుబాటులో ఉంచాలని ఈ కార్యక్రమం నిర్వహన జడ్పీ సీ.ఈ.ఓ మరియు పి.డి. డి.డబ్లు.ఎం. ఏ ల బాధ్యత అని తెలిపారు.జిల్లా పంచాయతీ అధికారులు సర్వే నిమిత్తం రోవర్లు , డ్రోన్లు ఉపయోగించి గ్రౌండ్ ట్రూతిన్గ్ మరియు గ్రౌండ్ వాలిడేషన్ చేసి 36 కాలం డేటాను పూర్తి చేసి గ్రామపంచాయతీ రిజల్యూషన్ చేయించి , ఫోటోలు , వీడియోలు , సంతకాలు చేసిన కాపీల ను పి.పి.సి. (పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ) వెబ్ సైటు లోకి స్వామి త్ర పనుల కింద అప్లోడ్ చేయాలని ఆదేశించినారు.జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తేది సందర్భంగా నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ప్రోత్సహించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 1905 స్వదేశీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారన్నారు. చేనేత కార్మికుల అమ్మకాలు ప్రోత్సహించేందుకు గాను కలెక్టరు/మండల రెవెన్యూ అధికారి కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా వారంలో శనివారం రోజున కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది స్వచ్ఛందంగా చేనేత వస్త్రాలు ధరించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. గ్రామ/మండల స్థాయిలో జాతీయ చేనేత దినోత్సవం జరిపేలా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.వ్యవసాయానికి సంబంధించి పిఎం కిసాన్ ఈ-కెవైసి గడువు తేది ఆగస్టు 31వ తేదిలోపు ఈ-కెవైసి అథెంటికేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిసిఆర్సి కార్డుల ద్వారా కౌలు రైతులు పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కిసాన్ డ్రోన్ల వినియోగం పై శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేలా వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. సీడ్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు గాను అనువైన స్థలాలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.పశు సంవర్థక శాఖకు సంబంధించి జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు చేనేత, ఆసరా పథకాల ద్వారా లబ్ది పొంది పశువులను కోనుగోలు చేసిన వారిని కూడా జగనన్న పాలవెల్లువలో నమోదు చేసి వారు ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా బహుళ ప్రయోజనాల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.జగనన్న సురక్షకు సంబంధించి రైజ్ చేసిన టోకెన్స్, రైజ్ చేసిన వాటిని సర్విసు రిక్వెస్ట్ రూపంలో నమోదు చేయు ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంతో పాటు హౌస్ హోల్డ్స్ సర్వేను వేగవంతం పూర్తి చేయాలన్నారు.వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలకు సంబంధించి నవంబర్ 1వ తేదిన సామాన్యుల్లోని అసమాన్య సేవలను ప్రత్యేకంగా సేవలు అందించిన విభాగాలలో (వ్యవసాయం, లలిత కళలు, సంస్కృతి, మహిళా సాధికారత, విద్యా, జర్నలిజం) తదితర వాటిలో ఉత్తమ సేవలు అందించిన వారికి జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఈ పురస్కారాలు అందజేయడం జరిగిందన్నారు. అందులో 2021వ సంవత్సరంలో 62 మందికి, 2022వ సంవత్సరంలో 30 మందికి అందజేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో బహుమతులు ప్రధానం చేయాల్సి ఉన్నందున ఆగస్టు 20వ తేదిలోపు వివిధ రంగాలలో అసమాన్య సేవలను అందించిన వారి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, అందుకు గాను స్థలాలను పాఠశాలలో ఉన్న మైదానాలను గుర్తించడంతో పాటు పిఈటి లను కూడా మ్యాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రీడల నిర్వహణకు జాయింట్ కలెక్టర్లు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. అదే విధంగా ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి లోగో డిజైన్ చెయ్యడానికి ఆసక్తి గల యువతి యువకులు www.adudamandhra.com సైట్ నందు ఆగస్టు 1వ తేది నుండి 10వ తేదిలోపు రిజిస్టర్ చేసుకొని డిజైన్ చేయడంతో పాటు పలు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author