చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం…
1 min read– ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని నందికొట్కూరు ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో భాగంగా చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలను తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తయారుచేయవచ్చని తల్లులకు వివరించారు . ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వంటకాల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాగులు , కొర్రలు, సజ్జలు ,అలసందలు, మొక్కజొన్నలు, పెసలు తదితర వాటి ప్రాముఖ్యత గురించి అధికారులకు వివరించారు. పూర్వీకులు పోషకాహారం తీసుకోవడంతో వారు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే చిరుధాన్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు, పిల్లలకు వైద్యాధికారులచే పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు లలితమ్మ ,వెంకటరమణమ్మ, ఇందిరమ్మ, అంగన్వాడీ ఆయాలు శ్రీలక్ష్మి ,మమత ,సుశీల తదితరులు పాల్గొన్నారు.