చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.. అంగన్వాడి టీచర్ చంద్రకళ
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: అత్యధిక పోషక విలువలు గల చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండవచ్చని అంగన్వాడీ టీచర్ చంద్రకళ అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవము పురస్కరించుకుని ఈనెల 20 నుండి ఏప్రిల్ 3 తేదీ వరకు పోషన్ పక్వాడ్ అనే ప్రదాన అంశంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 17 అంగన్వాడి కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ సహకారంతో ఏర్పాటుచేసిన చిరుధాన్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి ఆరోగ్య కార్యకర్తలు గర్భిణీ బాలింతలకు చిరుధాన్యాల ను ప్రదర్శించి వాటి ఉపయోగం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధిక పోషక విలువలు గల చిరుధాన్యాలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. కొర్రలు,జొన్నలు, సజ్జలు, రాగులు, శనగలు, వేరుశనగలు, బార్ల బియ్యం, పెసలు, గోధుమలు తదితర చిరుధాన్యాలు ఆహార పదార్థాలలో వినియోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరారు. బయట విక్రయించే ఆహార పదార్థాల కంటే అతి తక్కువ ఖర్చుతో, చౌకగా దొరికే చిరుధాన్యాలతో ఎన్నో వంటలు చేసుకోవచ్చన్నారు. ఇంటి వంటలు తయారు చేసేందుకు కొంత ఓర్పు కలిగి ఉండాలన్నారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు బాలింతలు చిరుధాన్యాల ఆహార పదార్థాలు తినడం ద్వారా అత్యధిక పోషక విలువలు కలిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త మాధవి, ఆశ కార్యకర్త శివలక్ష్మి వార్డులోని గర్భిణీ, బాలింతలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.