సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలి…
1 min readఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని…
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ తక్షణమే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు) ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో శనివారం స్థానిక పవర్ పేట మద్యం షాపు వద్ద ధర్నా నిర్వహించారు. మద్యపానాన్ని రద్దు చేయాలని, జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మన్నవ యామిని మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా జగన్ తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తానని మహిళలను నమ్మించి ఓట్లు కొల్లగొట్టి నేడు తన సొంత మద్యం బాండ్లను యదేచ్ఛగా విక్రయిస్తున్నారని విమర్శించారు. నేడు ప్రధాన నగరాలలో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతుందని, దీనివలన మద్యం సేవించే వారు అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం జరగాలంటే అధిక రేట్లు పెంచడం మార్గమని దానివల్ల తాగే వారి సంఖ్య తగ్గుతుందని జనాన్ని నమ్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల, కార్యనిర్వాహక అధ్యక్షురాలు కొండేటి బేబి, కార్యనిర్వాహక కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, ఉపాధ్యక్షులు మావూరి విజయ, కరటం సీతామహాలక్ష్మి, సహాయ కార్యదర్శులు గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, సీనియర్ నాయకురాలు మన్నవ లక్ష్మీ సౌభాగ్యం, ఎస్ కె లాల్ బి, తదితరులు పాల్గొన్నారు.