కలెక్టరేట్ మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయండి
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కలెక్టరేట్ భవన సముదాయంలోని మరమ్మత్తు పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సిపిఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.కలెక్టరేట్ భవన సముదాయంలో చేపడుతున్న పునరుద్దరణ పనులలో భాగంగా సిపిఓ కార్యాలయంలో జరుగుతున్న మరమ్మతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫ్లోరింగ్, ఇతర నిర్మాణపు పనులను పరిశీలించి,పనులు నాణ్యతగా చేయాలని పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ వెంట చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అప్పలకొండ తదితరులు ఉన్నారు.
