ఇంటింటి సర్వే ఆగస్టు 20వ తారీకు లోగా పూర్తి చేయండి…
1 min read– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం ఉదయం విజయవాడ నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఇంటింటి సర్వే ను ఈనెల 20 తారీకు లోగా పూర్తి చేయాలని ఆదేశించినారు.స్పెషల్ సమ్మరీ రివిజన్ -2024 పురస్కరించుకొని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో/కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లా కలెక్టర్లతో ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే గురించి విషయాలు , సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణము ఒక ప్రాంతంలో నివాసం ఉండి వారి ఓట్లు పట్టణము వేరొక ప్రాంతంలో ఉన్నట్లయితే అప్పుడు రాజకీయ పార్టీల ఏజెంట్ల తో ఈ విషయం కూలంకుశంగా చర్చించి వారి ఓట్లు ఆ చిరునామాలో ఉంచాలా లేదా అన్న నిర్ణయము తీసుకోవాలని సూచించినారు. ఇంటింటి సర్వే ను ఈనెల 20వ తారీకు లోగా రాజకీయ పార్టీ ఏజెంట్ల తో సమన్వయం చేసుకొని పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలో ఇంటింటి సర్వే గురించి జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు వివరించారు.కర్నూలు నుండి జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఈ.ఓ.ఆర్. లు మల్లికార్జునుడు , రమ , ఎలక్షన్ సెల్ సూపరింటెండ్ మురళి తదితరులు పాల్గొన్నారు.