హెచ్ఆర్సి కార్యాలయ నూతన భవనాన్ని పూర్తి చేయండి..
1 min read– స్పెషల్ ఆఫీసర్ మరియు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : బళ్లారి చౌరస్తా దగ్గరలో రాగ మయూరి సంస్థ వారు నిర్మిస్తున్న భవనంలోని అంతర్గత పనులను త్వరితగతిన పూర్తి చేసి మానవ హక్కుల కమీషన్ వారికి అప్పగించాలని స్పెషల్ ఆఫీసర్ మరియు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న రాగమయూరి సంస్థ డైరెక్టర్ ను ఆదేశించారు. బుధవారం మానవ హక్కుల కమీషన్ కార్యాలయ నూతన భవనాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న , జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజనతో కలిసి పరిశీలించారు . స్పెషల్ ఆఫీసర్ మరియు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న మాట్లాడుతూ రాగమయూరి సంస్థ వారు మానవ హక్కుల కమీషన్ కార్యాలయ కొరకు నిర్మిస్తున్న భవన పనులు పూర్తి అయ్యాయని పూర్తి అయిన పనులను పరిశీలించడం జరిగిందని ఇప్పటికే ఎలక్ట్రిసిటీ, వాటర్ కొన్ని ఫర్నిచర్ ఏర్పాటు చేశారని మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పూర్తిచేసి మానవ హక్కుల కమీషన్ వారికి అప్పగించాలని సెక్రెటరీ రాగమయూరి సంస్థ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డిని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన బిల్లులను త్వరితగతిన అప్లోడ్ చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను సెక్రెటరీ గ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ మానవ హక్కుల కమీషన్ కార్యాలయ భవనంలోని పనులు పూర్తి అయినాయని కొంత ఫర్నిచర్ మాత్రమే ఏర్పాటు చేయవలసి ఉందని వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి వివరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, రహదారులు మరియు భవనాల శాఖ ఎస్ ఈ నాగరాజు, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, సిపిఓ అప్పలకొండ, తదితర జిల్లా అధికారులు,రాగ మయూరి సంస్థ సిబ్బంది, పాల్గొన్నారు.