NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెండింగ్లో ఉన్న గ్రామ సచివాలయ నిర్మాణాలను పూర్తి చేయండి

1 min read

– డి ఈ. పి గంగాధర్.

పల్లెవెలుగు వెబ్ గడివేమల:  పెండింగ్ లో ఉన్న గ్రామ సచివాలయాలను రైతు భరోసా కేంద్రాలు వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ డి ఈ గంగాధర్ కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించారు. గురువారం నాడు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను పంచాయతీరాజ్  ఏఈ భాస్కర్ తో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నాణ్యతతో పనులు చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు మండలంలోని గడివేముల గ్రామంలో గ్రామ సచివాలయాలు రెండు పెండింగ్లో ఉన్నట్టు కరిమద్దెల ఒకటి చిందుకూరులో ఒకటి 75 శాతం నిర్మాణం పూర్తి చేసుకొని మిగతా పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు రైతు భరోసా కేంద్రాలు గడివేములలో ఉండుట్లలో ఒకటి మంచాలకట్టలో ఒకటి పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు వైయస్సార్ అగ్రి క్లినిక్ నిర్మాణాలు మూడు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు అనంతరం నాడు నేడు పనులు కింద మంచాలకట్టలో అప్పర్ ప్రైమరీ స్కూల్లో అదనపు తరగతి గదిలో నిర్మాణం పనులను పరిశీలించారు పక్కనే ఉన్న అంగన్వాడి సెంటర్ ను కూడా పరిశీలించి కేజీబీవీలో జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author