PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్లో ఉన్న ఈకేవైసీని రెండు రోజుల్లో పూర్తి చేయండి

1 min read

– ఎరువుల దుకాణాలను విస్తృతంగా తనిఖీ చేయండి
– వ్యవసాయ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రబీ పంట కాలానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఈకేవైసీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ టి.నిశాంతితో కలిసి జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి మోహన్ రావు, ఇరిగేషన్ ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖలు,ఏపీఎంఐపీ, మార్కెటింగ్, ఏపీఎంఐపీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ రబీ పంట కాలానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న లక్ష ఎకరాల ఈ క్రాఫ్ బుకింగ్ ని సోమవారం నాటికి పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే పీఎం కిసాన్ కింద పెండింగ్ లో ఉన్న 40,326 మంది రైతుల ఈ కేవైసీ ని 100% పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఏడీలను, మండల వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉయ్యాలవాడ, పగిడ్యాల, నందికొట్కూర్, సంజామల మండలాల్లోఈ క్రాఫ్ బుకింగ్ చేయకపోవడానికి గల కారణాలను సంబంధిత ఏడిఎలను కలెక్టర్ ప్రశ్నించారు. గత సమావేశపు మినిట్స్ పై ఆరా తీస్తూ పెండింగులో ఉన్న అంశాలపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల ద్వారాన రైతుల నుండి జొన్న మరియు శెనగ పంటలను మద్దతు ధరపై కొనుగోలు చేయాలని కరెక్ట్ ఆదేశించారు. ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించకుండా గరిష్ట ధరలకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ధరలకు విగ్రహిస్తే ఎఫ్ సిఓ 1985 ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

About Author