న్యాయవిచరణ పూర్తిస్థాయిలో జరిపి ..మా పట్టాలు మాకే కేటాయించండి..
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గోనెగండ్ల గ్రామంలో రజకులకు 1992 లో రజకులకు అప్పటి ప్రభుత్వం మూడు సెంట్లు ప్రకారం 66 పట్టాలు మంజూరు చేయడమైనది అనివార్య కారణాలవల్ల పునాదులకాడ నే నిలిచిపోయినాయి ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మీకు ఇప్పుడు మూడు సెంట్లు ప్రకారం ఇవ్వడం కుదరదు 1.50 సెంట్లు ప్రకారం ఇష్టం, మీ పట్టాలు మీకు ఇస్తాం అని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మరియు కొద్దిమంది వ్యక్తులు కలిసి 80 శాతం పట్టాలు మాత్రం రజకులకు కేటాయించి మిగతా 20% పట్టాలు ఇతరులకు కేటాయించడం జరిగింది రజకుల పట్టాలు రజకులకే ఇవ్వాలి ఇతరులకు ఎలా ఇస్తారు వేరే వర్గం వారికి ఎలా కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని విధాలుగా వెనకబడినారు బలహీనులు కావున మా పట్టాలు మాకే కేటాయించాలి. దీనిపైన పూర్తి విచారణ చేసి ఇందుకు అక్రమాలకు పాల్పడిన అధికారులు మరియు కొద్దిమంది వ్యక్తులు (డాక్టర్ శివ. సిపి మద్దిలేటి. పెద్దింటి శ్రీనివాసులు. బకాయి శేఖర్) వీరు పైన న్యాయవిచరణ పూర్తిస్థాయిలో జరిపి వీరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గోనెగండ్ల రజక సంఘం సభ్యులు కోరుచున్నాము.