NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐఐఐటిడిఎం సదుపాయాల పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టండి

1 min read

– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జగన్నాథ గట్టుపై ఉన్న  ట్రిపుల్ ఐటీ డిఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మ్యానుఫ్యాక్చరింగ్)కు  కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ను అదేశించారు. సోమవారం సాయంత్రం విజయవాడ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ IIT, IIITDM, AIMS  ల నిర్మాణల పురోగతి పై సమీక్ష నిర్వహిస్తూ కర్నూలు జగన్నాథ గట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీడిఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్&మ్యానుఫ్యాక్చరింగ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కర్నూలు ట్రిపుల్  ఐటీడిఎం సంస్థకు మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ ని అడగగా జగన్నాథగట్టు పై ఉన్న ఐఐఐటిడిఎం (IIITDM) సంస్థ కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యంగా సంస్థ ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి జనవరి 31 వ తేది నాటి నుండి పనులు ప్రారంభించడం జరిగిందని వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.అలాగే శాశ్వతమైన త్రాగు నీటి సరఫరాకి సంబంధించిన పనులు, సంస్థ భవన సముదాయం మీదుగా వెళ్లే  హై టెన్షన్ విద్యుత్ లైన్లు మార్చేందుకు సంబందించిన పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు.. ముఖ్యంగా  అప్రోచ్ రోడ్డు వెంట వీధి లైట్ల ఏర్పాటుకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.. NH 40 నుండి IIITDM సంస్ధ వరకు చేయాల్సిన రోడ్డు వెడల్పు పనులు కూడా పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ వివరించారు… ఈ సమావేశంలో జిల్లా  స్పెషల్ ఆఫీసర్/ ఆర్ & బి , ట్రాన్స్పోర్ట్  ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రద్యుమ్న కూడా IIITDM సంస్థ కు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పనులు గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో IIITDM డైరెక్టర్ డా.. డి.వి.ఎల్.ఎన్. సోమయాజులు, రిజిస్ట్రార్  కె.గురుమూర్తి, డిఆర్ఓ కే. మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.

About Author