గ్రామ/వార్డు సచివాలయ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయండి
1 min read
ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా చేపట్టండి
వాట్సాప్ ద్వారా పౌర సేవలు విస్తృతం చేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి సచివాలయ సర్వీసులు, ఉపాధి హామీ, హౌసింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, మిస్సింగ్ ఎంప్లాయ్ సిటిజన్స్, ఇమేజ్ క్యాప్చరింగ్, జియో కోఆర్డినేట్స్ లో తక్కువ శాతం పెండింగ్ లో పెండింగ్ లో ఉందని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్క్ ఫ్రం హోమ్ కు సంబంధించి ఇంకా 2,61,835 మంది పెండింగ్ ఉన్నారని అందులో నంద్యాల (అర్బన్), పాములపాడు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ (అర్బన్), గోస్పాడు, సిరివెళ్ల, డోన్ (అర్బన్), నంద్యాల (అర్బన్), బేతంచెర్ల (రూరల్), బనగానపల్లె (రూరల్) పెండింగ్ లో ఉన్నాయని వెంటనే పూర్తి చేసేందుకు ఎంపిడిఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మిస్సింగ్ ఎంప్లాయ్ సిటిజన్స్ కు సంబంధించి ఆత్మకూరు (రూరల్), కొలిమిగుండ్ల, రుద్రవరం, బనగానపల్లె, సిరివెళ్ల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ (అర్బన్), జూపాడు బంగ్లా మండలాల్లో 3636 మంది ఎంప్లాయిస్ డేటా పెండింగ్ లో ఉందని డిఎల్డిఓలు సచివాలయ సిబ్బందిచే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇమేజ్ క్యాప్చరింగ్, జియో కోడ్నెట్స్ కు సంబంధించి ఇంకా 12వేలు పెండింగ్ లో ఉన్నాయని అందులో ఆత్మకూరు (రూరల్), పాములపాడు, కొలిమిగుండ్ల, బనగానపల్లె, బేతంచెర్ల (రూరల్), ఆళ్లగడ్డ (అర్బన్), డోన్, నందికొట్కూరు మండలాలలో పెండింగ్ ఉన్నాయని, ఈ కేవైసీ కి సంబంధించి ఇంకా 2,68,182 పెండింగ్ ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ఎన్పిసిఐ, నాన్ రెసిడెన్ట్, చిల్డ్రన్ వితౌట్ ఆధార్ తదితర సర్వేలను పూర్తి చేయించాలన్నారు. సచివాలయ సిబ్బంది ఇన్ అండ్ ఔట్ హాజరు శాతాన్ని కచ్చితంగా పాటించాలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు.హౌసింగ్ కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని అర్హులైన లబ్ధిదారులకు తెలియజేసి గృహాలు నిర్మించుకునేలా మోటివేట్ చేయాలన్నారు. ఆత్మకూరు, ఆళ్లగడ్డ, పగిడ్యాల, ఆత్మకూరు (అర్బన్), డోన్, జూపాడుబంగ్లాలోని లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్న అదనపు ఆర్థిక సహాయం గురించి తెలియజేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 7 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక సరిగా తీసుకోవాలన్నారు. శ్రీశైలం, మహానంది, జూపాడుబంగ్లా మండలాల్లో ఒక్క ఇల్లు కూడా స్టేజ్ కన్వర్షన్ కు రాలేదని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఏఈలను కలెక్టర్ ఆదేశించారు. రూఫ్ లెవెల్, రూఫ్ కాంక్రీట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై దృష్టి పెడితే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.వాట్సాప్ (9552300009) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఇంటి వద్దనే ఉండి ఫోన్ ద్వారా సర్వీసులను పొందే అవకాశం ఉంటుందన్నారు. అందులో విద్యుత్ బిల్లు, విద్యార్థుల హాల్ టికెట్స్ డౌన్లోడ్, పౌరులు సేవలను పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సేవల ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుండి ప్రభుత్వం అందిస్తున్న సర్వీసులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.