5వ రోజు విజయవంతంగా ఎమ్మెల్యే పాదయాత్ర పూర్తి
1 min readవిజయవంతంగా పూర్తయిన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్ర..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఏలూరు రూరల్ మండలంలోని 10 గ్రామాల్లో 5 రోజుల పాటు 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి జాలిపూడిలో ఐదవ రోజు ఘనంగా జరిగిన పాదయాత్ర అనంతరం, ఏలూరు రూరల్ మండలంలో ముగిసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రెండో విడత “ప్రజా ఆశీర్వాద యాత్ర” జాలిపూడి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఎమ్మెల్యేకి ఆనందంగా స్వాగతం పలుకుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతి కూడలిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి , ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల గురించి కనుక్కుంటూ, వినతి పత్రాలు స్వీకరించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ ముందుకి సాగారు. జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలకు అదనంగా, జాలిపూడిలో 8 లక్షలతో స్వచ్చమైన త్రాగు నీటిని అందించే మైక్రో ఫిల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 18.06 లక్షలతో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు నేడు ఫేజ్ 1 కింద పూర్తి చేసిన అభివృద్ధి పనులను అలాగే 7 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణానికి రక్షణగా కట్టిన ప్రహరీ గోడను మరియు 15 లక్షలతో సీసీ డ్రైయిన్ తో పాటుగా కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఎమ్మెల్యే జాలిపూడి నుండి కాట్లంపూడి గ్రామానికి చేరి, విస్తృతంగా పాదయాత్ర నిర్వహించి, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం ఎమ్మెల్యే గత ఐదు రోజులుగా 10 గ్రామాల్లోని ప్రజల మధ్యలో, ఎంతో ఆనందోత్సవాల మధ్య ఎన్నో ప్రారంభోత్సవాలు నిర్వహించి రెండో విడత “ప్రజా ఆశీర్వాద యాత్ర” ముగిసిందని ప్రకటిస్తూ, తనకు అండగా నిలిచిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ తరువాత మూడో విడత “ప్రజా ఆశీర్వాద యాత్ర” ఉంటుందని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తానని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, స్థానిక సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.