నిబంధనలు పాటించని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణం లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రతిభ, రాఘవేంద్ర, విజయసాయి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఆర్డిఓ రామలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాయని కళాశాలలు ప్రారంభంలో క్యానివర్సింగ్ కి వచ్చినప్పుడు కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెట్టి కళాశాలలో చేర్పించడం జరుగుతుంది విద్యార్థులు చేరినప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం సిగ్గుచేటన విషయమని అలాగే ప్రైవేట్ కళాశాలలో నిర్మించిన ఆరు సంవత్సరాల లోపు సొంత భవనాలు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని లేకపోతే ఆ కళాశాలను సీజ్ చేస్తామని ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ఈ నిబంధనలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలకు సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా అవగాహన లేనటువంటి ఉపాధ్యాయులను నియమించి, కళాశాలలో అన్ని గ్రూపులు నిర్వహించి ఆ గ్రూపులకు సంబంధించి ల్యాబ్లు ల్యాబ్ ఎక్యుప్మెంట్స్ కంప్యూటర్లు లేకుండా విద్యార్థులకు మోసం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతిభ, రాఘవేంద్ర, విజయ సాయి, డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు తెలియజేయడం జరిగింది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని విద్యాశాఖ అధికారులను సూచించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి మా భాష, టౌన్ అధ్యక్షులు వినోద్, ఏఐవైఎఫ్ తాలూక అధ్యక్షుడు పెద్దయ్య నాయకులు చిరంజీవి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.