రాజీపడటమా.. రద్దు చేయడమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజీపడడం కంటే అసెంబ్లీ రద్దుకు సిద్ధమయ్యి, అధికారాన్ని త్యజించడమే ఉత్తమమని ఉద్ధవ్ థాక్రే భావిస్తున్నారని సమాచారం. ఇందుకోసం మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్‌సీపీలను ఒప్పించబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతూ ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ ‘ సంక్షోభం మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు దారితీస్తోంది’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్త చర్చకు దారితీసింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ ట్వీట్‌ను రౌత్ డిలీట్ చేశారు. కాగా ఉద్ధవ్ థాక్రే వైపు ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.