PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడుగు బలహీన వర్గాల పెన్నిధి కామ్రేడ్ బిజీ మాదన్న

1 min read

– 6,వ,వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి:సీపీఐ

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండల పరిధిలో కే.తిమ్మాపురం గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ బిజీ మాదన్న పేదల పక్షపాతి భూస్వామి,పెత్తందాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడిపి సమస్యల నుండి పేద ప్రజలకు విముక్తిని కలిగించిన వ్యక్తి కామ్రేడ్ బిజీ మాదన్న  అనీ సిపిఐ సీనియర్ నాయకులు  భీమ లింగప్ప,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి  నబి రసూల్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రంగన్న తెలిపారు.ఆయన ఆరవ వర్ధంతి సందర్భంగా కే తిమ్మాపురం లో కామ్రేడ్ బిజీ మాదన్న  స్తూపానికి సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ సీనియర్ నాయకులు  భీమ్ లింగప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నబి రసూల్ పాల్గొని మాట్లాడుతూ బిజీ మాదన్న  నిరంతరం ప్రజా సమస్యలపై ముక్కుపోని దీక్షతో అనేక పోరాటాలు నడిపిన వ్యక్తి, ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజవర్గాలలో భూములేని నిరుపేదలకు భూ పోరాటాల ద్వారా భూమి ఇప్పించిన ఘనత ఆయనకే దక్కిందని వారు తెలిపారు. అదేవిధంగా ఆ రోజులలో భూసంపెత్తందారులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నడిపి వారి ఆధీనంలో ఉన్న భూములను విడిపించి పేదలకు పంచడం జరిగిందని, అదేవిధంగా కలగట్ల సమీపంలో ఉన్న కొండమ్మ చెరువు కోసం అనేక పోరాటాలు నడిపి ప్రభుత్వాల మెడల పంపి కొండమ్మ చెరువును సాధించడం జరిగిందని వారు గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కే. తిమ్మాపురం సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుని గా పనిచేసి గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని వారు తెలిపారు.సిపిఐ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే రాష్ట్ర స్థాయికి ఎదగడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న నాయకులు ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్లడానికి కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాదన్న  కుటుంబ సభ్యులు విరుపాక్షి నాయుడు సిపిఐ జిల్లా నాయకులు భాస్కర్ యాదవ్, గోనెగండ్ల మండల కార్యదర్శి నాగప్ప,సిపిఐ మండల మండల కార్యదర్శి బి.టి చిన్నాన్న,సహాయ కార్యదర్శి రాజీవ్,సిపిఐ సీనియర్ నాయకులు బజారి,దాదావలి, మద్దిలేటి నాయుడు, గుజిరి రహిమాన్, వలి,సోమేశ్వర్ రెడ్డి, మల్లికార్జున గౌడ్,తిమ్మా గురుడు,విజయేంద్ర, నరసింహులు,సుంకన్న రోషన్,ఎల్లప్ప,నాయుడు, శాంతప్ప,విజయ్,బాబు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author