కామ్రేడ్ ధర్మభిక్షం జీవితం ఆదర్శం : రామచంద్రయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: ధర్మభిక్షం గారి శతజయంతి ఈ సందర్భంగా పత్తికొండలో చదువుల రామయ్య భవనంలో కామ్రేడ్ ధర్మభిక్షం గారి ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు , మాజీ పార్లమెంట్ సభ్యులు, బహుజనుల ఆత్మ బంధువు అవినీతిని ఓర్వని నిజమైన ప్రజా నాయకుడు కామ్రేడ్: ధర్మభిక్షం అని అన్నారు. కామ్రేడ్ ధర్మ బిక్షం సూర్యాపేటలో నిరుపేద కల్లు గీత కుటుంబంలో జన్మించారని తెలిపారు. పేదరికం శాపం అయినా ఎదురించి చదువుల తల్లి ముద్దుబిడ్డగా థర్డ్ ఫారం వరకు తరగతి గదిలో మొదటి ర్యాంకు విద్యార్థిగా ఉన్నారని అన్నారు. చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలను పునికిపుచుకున్న ఆయన హైదరాబాద్ రెడ్డి హాస్టల్ విద్యార్థి నాయకుల ప్రేరణతో సూర్యాపేట స్కూల్లో గ్రంధాలయం,పత్రికలు,విద్యార్థి చర్చ-వేదిక అనే మూడు అంశాలపై ఒకరోజు సమ్మె చేసి సాధించారని పేర్కొన్నారు. నైజాం నవాబు జన్మదిన వేడుకలను తిరస్కరించి సంచలనం సృష్టించారని అన్నారు. హైస్కూల్లో చేరి వందేమాతరం ఉద్యమానికి నాయకత్వం వహించి విద్యార్థి నాయకునిగా ఎదిగారని తెలిపారు. ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకొని, నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారని తెలిపారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారని అన్నారు.