సమసిన ఉక్రెయిన్, రష్యా ఆందోళన.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min read
పల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ భయాలతో ఇటీవల స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లోకి జారుకుంది. అయితే.. ఈరోజు ఇరు దేశాల మధ్య ఆందోళనలు తగ్గుముఖం పట్టిన సంకేతాలు వెలువడటంతో భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం పాజిటివ్ గా మొదలైన సూచీలు.. అనంతరం వచ్చిన రష్యా, ఉక్రెయిన్ ఆందోళన ఉపశమన సమాచారంతో పుంజుకున్నాయి. యూరప్ మార్కెట్లు కూడ పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1736 పాయింట్ల లాభంతో 58142 వద్ద, నిఫ్టీ 509 పాయింట్ల లాభంతో 17,352 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 1261 పాయింట్ల లాభంతో 38170 వద్ద ట్రేడింగ్ ముగించాయి.