కండోమ్ సహాయం.. ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఒలంపిక్స్ క్రీడల్లో క్యానో స్ప్రింట్ అనేది ఒక విభాగం. నీటిపై కయాకింగ్ చేయడం దీని ప్రత్యేకత. ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా ఫాక్స్.. క్యానో స్ప్రింట్ సోల్లోమ్ సీ1 విభాగంలో అందర్నీ ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. క్యానో సాల్లోమ్ కే1 ఫైనల్లోను కాంస్యం సాధించింది. అయితే ఈ విజయానికి కండోమ్ కూడ కారణమని చెబుతోంది జెస్సికా. క్యానో స్ప్రింట్ పోటీల్లో కయాకింగ్ అంటే సన్నగా ఉండే పడవల్లో ఒకరు మాత్రమే కూర్చుని తమ శక్తిసామర్థ్యాల మేరకు నదులు, సరస్సుల పై ముందుకు సాగుతారు. ఒలంపిక్స్ లో పోటీ పడుతున్న జెస్సికాకు అనుకోకుండా ఓ అవాంతరం ఏర్పడింది. ఆమె పడవ మరమ్మతుకు గురైంది. దాన్ని సరిదిద్దేందుకు కార్బన్ మిశ్రమాన్ని ముందు భాగంలో అదిమిపట్టి తర్వాత అది నీటిలో తొలగిపోకుండా ఉండేందుకు స్మూత్ ఫినిషింగ్ కోసం కండోమ్ వాడినట్టు ఆమె తెలిపింది. తన విజయానికి ఆఖరి నిమిషంలో కండోమ్ ఉపయోగపడిందని పేర్కొంది.