PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కూళ్లలో కండోమ్స్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అమెరికాలోని షికాగో ప‌బ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేష‌న్ బోర్డు సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠ‌శాల‌ల్లో కండోమ్స్ అందుబాటులో ఉండే విధంగా చ‌ర్యలు తీసుకుంది. ఈ నిబంధ‌న బోర్డు ప‌రిధిలోని 600 స్కూళ్లలో వ‌ర్తిస్తుంద‌ని సీపీఎస్ ప్రక‌టించింది. 2020లోనే సీపీఎస్ ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేష‌న్ లో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది బోర్డు అభిప్రాయం. ఎలిమెంట‌రీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000 కండోమ్స్ అందుబాటులో ఉంచనున్నారు. షికాగో ఆరోగ్య శాఖ స‌హ‌కారంతో ఈ కండోమ్స్ స‌ర‌ఫ‌రా చేస్తారు. కండోమ్స్ తో పాటు శ‌రీర నిర్మాణ శాస్త్రం, యుక్త వ‌య‌సులో శ‌రీరంలో క‌లిగే మార్పులు, లైంగిక ధోర‌ణులు, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను బోధిస్తారు. దీనిపై అభ్యంత‌రం ఉన్న త‌ల్లిదండ్రులు బోర్డుకు లిఖిత‌పూర్వకంగా ఫిర్యాదు చేసే అవ‌కాశాన్ని బోర్డు క‌ల్పించింది. బోర్డు నిర్ణయాన్ని కొంద‌రు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మ‌రికొంద‌రు స్వాగ‌తిస్తున్నారు.

About Author