ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి
1 min read
ప్యాపిలీ, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆర్జెడి కి కళాశాలలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల ఉన్నత అధికారి అయిన ఆర్జెడి కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ “గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయగా, ఆ చెక్కులను విద్యార్థులకు అందించకుండా విద్యార్థులు కళాశాల యొక్క ఫీజును పూర్తిస్థాయిలో చెల్లిస్తేనే మీ చెక్కులు అందిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ సర్క్యులర్ జారీ చేయడం బాధాకరమనీ, ప్రభుత్వం ఒకవైపున ఏ కళాశాలలు విద్యార్థులను ఫీజు కట్టాలని అడగవద్దని, అలా చేస్తే వాటిపైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తే అవేవి పట్టించుకోకుండా ప్రైవేటు కళాశాలలో కన్నా హీనంగా ప్రభుత్వ పాఠశాలలో కళాశాల ప్రిన్సిపల్ ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదని, అదేవిధంగా న్యాక్ లో జరిగిన అవినీతిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలనీ, కళాశాల అభివృద్ధి అనేది పూర్వం చదివిన విద్యార్థులు సొంత నిధులతో కళాశాల అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని నా సొంత ఖర్చులతో చేశానని చెప్పి, బిల్లులు సృష్టించుకుని అవినీతికి పాల్పడ్డారని, అడీషనల్ ఫీజులు, స్పెషల్ ఫీజుల పేరుతో విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులను, కళాశాల ప్రిన్సిపాల్ వారి సొంత అవసరాలకు వాడుకున్నారని వారు అన్నారు. ఒక వైపు కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని మధ్యాహ్నం భోజనం పెట్టి అమ్మాయిలకు ఫ్రీగా ఆటోలు పెట్టి సొంత నిధులను కేటాయిస్తుంటే, మరొక వైపు కళాశాల ప్రిన్సిపల్ చేతివాటం చూపించడం సిగ్గుచేటని, కావున వీటన్నిటి పైన సమగ్ర విచారణ జరిపించి, కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆర్జెడి కళాశాల ప్రిన్సిపాల్ ని ప్రశ్నించగా, తల తోక సంబంధం లేనట్టుగా సమాధానాలు ఇస్తూ తను చేసిన తప్పులను, తనతో పాటు పని చేస్తున్న ఉద్యోగులపై నెట్టగా, ఈ అంశాలపై ఆర్జెడి సీరియస్ అయ్యి, మరియు కళాశాల అడ్మిన్ సెక్షన్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివహరిస్తున్నారని వారికి ఆర్జెడి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని, త్వరలో వీటి పైన సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు శశిధర్ రెడ్డి , మండల అధ్యక్షులు ప్రవీణ్ , మహేష్ , హరి , మల్లీ , విష్ణువర్ధన్ , మోహన్ , తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
