సాధారణ ఎన్నికల నిర్వహణ కు …ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నాం
1 min readసి ఈ ఓ కు తెలియజేసిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ జి.సృజన..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సాధారణ ఎన్నికల నిర్వహణ కు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని సి ఈ ఓ కు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ జి.సృజన వివరించారు.శుక్రవారం సాయంకాలం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధత, ఫార్మ్స్ డిస్పోజల్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డాక్టర్ జి. సృజన సీఈఓ కు వివరిస్తూ…జిల్లాలో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఓటరు చేర్పులు, మార్పులకు, తొలగింపులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వేగవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. ఎపిక్ కార్డులను మార్చ్ 10 లోపు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం పూర్తి చేశామన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు తెలియచేస్తున్నా మన్నారు..ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు.కంట్రోల్ రూం, MCMC, సోషియల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.