NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ .. మూల్యాంకన రేట్ల పెంపు పై ఆపస్ హర్షం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ మరియు మూల్యాంకనం లో పాల్గొనే సిబ్బందికి ఇచ్చే రెమ్యూనరేషన్ రేట్లు 2016లో ఉన్న రేట్లనే ఇప్పటివరకు కొనసాగిస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం( ఆపస్) గతవారం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ శ్రీ డి దేవానంద రెడ్డి గారికి ఇచ్చిన వినతి పత్రం మేరకు ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 137 ద్వారా దాదాపు 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం ఆనందదాయకమని, ఈ విషయమే హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఉపాధ్యాయ వర్గాల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ శ్రావణ్ కుమార్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ ఓ ప్రకటనలో తెలియజేశారు సిహెచ్ శ్రావణ్ కుమార్& ఎస్ బాలాజీ రాష్ట్ర అధ్యక్షులు &ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

About Author