రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించండి
1 min readజిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో రహదారి భద్రతా మాసోత్సవాలకు సందర్భంగా పోస్టర్లను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాలకు భాగంగా జనవరి 20వ తేది నుంచి ఫిబ్రవరి 19తేది వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించకూడదన్నారు. మోటారు యాక్ట్ చట్టం సెక్షన్ 129 ప్రకారం వాహనదారులు వాహనాలు నడిపేటపపుడు హెల్మెట్ ధరించాలి లేని యెడల సెక్షన్ 177 ప్రకారం జరిమానా విధించడం జరుగుతుందన్నారు. వాహనానికి సంబంధించిన లైసెన్సులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదే విధంగా కారులో ప్రయాణించే వారు డ్రైవర్ తో సహా అందరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, కారు నడిపే సమయంలో ఫోన్ ఉపయోగించకూడదన్నారు. సిగ్నల్స్ ను అనుసరించి నియమ నిబంధనలు పాటించని పాదచారులకు రోడ్డున దాటే అవకాశం కల్పించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.కార్యక్రమంలో డిటిసి శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ నాగభూషణం, ఆర్టీవో రమేష్, డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, ఆర్ అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.