గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి
1 min read– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పేర్కొన్నారు.కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష రీ సర్వే కి సంబంధించిన కార్యక్రమాలపై తహసీల్దార్ లు,, డెప్యూటీ తహశీల్దార్లు (సర్వే), సర్వే అధికారులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 100 సంవత్సరాల తర్వాత జరుగుతున్న రీ సర్వే పనులు నిర్దేశిత గడువు లోపు పూర్తి చేసేందుకు రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు..రీ సర్వే పనులకు సంబంధించిన రిజిస్టర్లు మరియు డాక్యుమెంట్స్ రాబోయే 4,5 తరాల వారు ఉపయోగిస్తారని, అందువల్ల ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్ కరెక్షన్స్, మ్యుటేషన్ ట్రాన్సక్షన్స్, డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఫేస్-1 లో 472 రెవెన్యూ గ్రామాలకు గాను 68 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి అందుకు సంబంధించిన ఓఆర్ఐ లు కూడా వచ్చాయని,ఫైనల్ ఆర్ఓఆర్ లు కూడా ఇచ్చామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. వెబ్ ల్యాండ్ నుండి వెబ్ ల్యాండ్ 2.0 కి పోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేసిన మొదటి జిల్లా కర్నూలు అని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు.. ఎల్పిఎమ్ కి సంబంధించి జనరేషన్ త్వరగా చేయాలని, స్పేషియల్, టెక్స్ట్యువల్ డేటా ఎంట్రీ ట్యాలీ అవ్వాలన్నారు. గ్రౌండ్ ట్రూథింగ్ చేయగానే ఖచ్చితంగా 9(2) నోటీసులు జారీ చేయాలని సంబంధిత వారికి ఎదైనా ఆబ్జెక్షన్ ఉంటే సెక్షన్ 10 కింద అప్పీల్ చేసుకుంటే మండల సర్వేయర్ పరిశీలించి సమాధానం ఇస్తారని, ఆయన కూడా మరల ఆబ్జెక్షన్ ఉంటే సెక్షన్ 11 కింద అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ లో మ్యుటేషన్ ఆఫ్ కరెక్షన్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చారని తెలిపారు. . గ్రౌండ్ ట్రూథింగ్ నివేదికలు గ్రామాల వారీగా ప్రతి రోజు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ సర్వే కి సంబంధించిన ఫామ్ 1 షెడ్యూల్ ప్రతి ఒక్క భూమి యజమానికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు సర్వే చేసేటపుడు సంబంధిత శాఖ వారికి సర్వే నోటీస్ ఇచ్చి ఫామ్ 10 రూపంలో వారితో అక్నాలెడ్జ్మేంట్ తీసుకోవాలని సూచించారు. పిఓఎల్ఆర్ వర్క్ షీట్ ఫర్ గ్రౌండ్ ట్రూథింగ్ ఫామ్-6ఎ వివరాలను ఎంట్రీ చేయాలని అన్నారు..డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ రాగానే గ్రామ సభ ఏర్పాటు చేసి ఎదైనా అప్పీల్ చేసుకోవాలి అంటే 14 రోజలు సమయం ఉంటుందని చెప్పాలని, ఫైనల్ ఆర్ఓఆర్ రాగానే మరల గ్రామ సభ ఏర్పాటు చేసి ఎదైనా అప్పీల్ చేసుకోవాలి అంటే సంవత్సరం పాటు సమయం ఉంటుందని చెప్పాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డిఆర్ఓ మల్లికార్జునుడు,కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ ఎడి పవన్ కుమార్, KRCC స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మీ, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే విజయ సారధి, తదితరులు పాల్గొన్నారు.