PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంబీఏ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి లోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నాడు మొదటి సంవత్సరం ఎంబీఏ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయచోటి సి . ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి. గణేష్ కుమార్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో కెల్లా భారత దేశంలో యువత అధికమని కావున క్రమశిక్షణ అంకిత భావంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని సూచించారు. మేనేజ్మెంట్ రంగంలో అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు . శ్రీ సాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం . సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాలలో విద్యార్థులకు 100 శాతం ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని అకడమిక్ అంశాలతో పాటు  సెమినార్ , వేబీనార్ ,కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని వివరించారు. కృషి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, దీనికోసం మొదటి సంవత్సరం నుండే ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేయాలని సూచించారు . వ్యవస్థను పటిష్ఠపరిచి ఉత్పాదన పెంచడంలో మేనేజ్మెంట్ రంగం కీలకమైనదని అభిప్రాయపడ్డారు  .ఉత్పాదక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకు పెట్టుబడుల స్వర్గధామంగా ఉందని కావున ఈ రంగంలో దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎక్కువ అని వివరించారు  .ఈకామర్స్, అకౌంటెన్సీ ,బిజినెస్ ,బ్యాంకింగ్ మరియు  మార్కెటింగ్ వంటి పలు విభాగాలలో  మేనేజ్మెంట్ పాత్ర  కీలకమని వివరించారు   . మేనేజ్మెంట్ విభాగం అధిపతి ఇంతియాజ్ గారు  మాట్లాడుతూ కళాశాలగా డిజిటల్ లైబ్రరీ, బోధన ,పరిశోధనలో  అనుభవజ్ఞులైన  అధ్యాపకులు  అందుబాటులో ఉన్నారని, అర్హత సాధించిన విద్యార్థులందరికీ కళాశాలలో  ఉద్యోగ  అవకాశాలను కల్పిస్తున్నామని కమ్యూనికేషన్ స్కిల్స్, అర్థమెటిక్, రీజనింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు . కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ. బాలాజీ ,వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author