దళిత క్రైస్తవుల సువార్తికుల సదస్సు
1 min read– క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి:పెరికె వరప్రసాదరావు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి తాడేపల్లి వడ్డేశ్వరంలో ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల సువార్తికుల సదస్సు జరిగినది, ఈ కార్యక్రమంలో ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవులకు ఎంతో మేలులు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కొనియాడారు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లందరూ మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని 2024 లో గెలిపించాలని కోరారు,అదే విధంగా గౌరవ వేతనం అప్లై చేసుకుని పాస్టర్లు త్వరగా సొసైటీ రిజిస్ట్రేషన్ బ్యాంకు ఖాతాతో సచివాలయంలో వెల్ఫేర్ సెక్రెటరీ నీ కలవాలని ఎలిజిబులిటీ ఉన్న పాస్టర్లు అందరూ కూడా గౌరవ వేతనం 5000 రూపాయలకు అప్లై చేసుకోవాలని కోరారు, అదేవిధంగా తాడేపల్లి మండలంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కొరకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ తాడేపల్లిలో నిర్మించాలని తాడేపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ వారు కోరడం జరిగింది ఈ అంశాలు మైనార్టీ మంత్రి అంజుత్ భాష మరియు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నోటీసులు కు తీసుకెళ్తామని పెరికె వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు, అదేవిధంగా క్రైస్తవులకు మత స్వేచ్ఛా హక్కుల రక్షణ కల్పించాలని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో ఐడీసీఎల్ జిల్లా అధ్యక్షులు పులిపాక జాన్ పాల్ బిషప్ జాన్ కెనడి, చావాలి ఎలీషా కుమార్,ఆర్ వి శాస్త్రి ,పాస్టర్ బి రమేష్ తాడేపల్లి మండల మరియు రూరల్ పాస్టర్ ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాద్ రావుని ఘనంగా సత్కరించారు.