ఈనెల 27న విజయవాడలో ముస్లిం మైనార్టీల సదస్సు..
1 min read
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సభకు అందరు సహకరించాలి: ఈనెల 27వ తేదీన విజయవాడలో జరగనున్న ముస్లిం మైనార్టీలు సదస్సు కోసం రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ వర్గాలను ఆహ్వానిస్తున్నానని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్రముస్లిం మైనారిటీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అమీన్ బాయ్ ఓక ప్రకటన తెలిపారు . కాకినాడ జిల్లా అమీన్ బాయ్ విచ్చేసిన సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి పిట్ట వరప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ,అమీన్ భాయ్ కు ఘాన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా ఈ నెల 27 విజయవాడ లోజరగనున్న ముస్లిం మైనారిటీల సదస్సు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాలను కలిసి ఆహ్వానాలుఅందించిన అమీన్ భాయ్, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు,మానవహక్కుల సంస్థ లు, మేధావులు, మహిళలు, యువత, ప్రజాసంఘాలు, మత పెద్దలు, విద్యార్థులు, అందరు పాల్గొన్నాలని ఆయన పిలుపునిచ్చారు.