జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో సదస్సు
1 min read
భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, బాధ్యతలు,న్యాయం, కల్పించింది
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ గురువారం “జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం” సందర్భంగా పెదవేగి మండలం కొప్పాక గ్రామంలోని హైస్కూల్ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునకు సమాన హక్కులు, సమాన బాధ్యతలు సమాన న్యాయాన్ని కల్పించిందని ఈ సమాన న్యాయం అందరికీ అందుబాటులో ఉండటానికి ఆర్థికంగా వెనుకబడిన, అవసరమైన భారత పౌరులకు ఉచిత న్యాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్నాయని, ఒక న్యాయ వ్యవస్థ కాకుండా ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందించడం కోసం సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఈ సంక్షేమ పథకాల పొందటములో ఎటువంటి ఇబ్బందులు ఎదురైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించవచ్చని తెలియజేశారు. అలాగే మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని ఈ జాతీయ లోక్ అదాలత్ నందు నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు మరియు రాజీయోగ్యమని ఇతర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు.కార్యక్రమంలో ప్యానల్ లాయర్ పి వెంకటేశ్వరరావు, స్కూల్ హెడ్మాస్టర్ కే శైలజ పెదపాడు ఎస్సై కృపావరం తదితరులు పాల్గొన్నారు. తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ స్థానిక శనివారం పేటలోని బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అబ్జర్వేషన్ హోమ్ లో ఉన్న బాలలకు అందుతున్న న్యాయ సహాయం పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే వసతి గృహంలో బాలురకు అందిస్తున్న ఆహార పదార్థాలను నాణ్యత పరిసరాల శుభ్రత పై వివరాలు అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో హోమ్ సూపరింటెండెంట్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
