‘ కూటమి’ పై నమ్మకం పెరిగింది…
1 min read
ఉద్యోగుల బకాయిలకు రూ. 6200 కోట్లు కేటాయించడం సంతోషకరం..
- నిధులలో రిటైర్డు పెన్షనర్లకు గుర్తిస్తే… బాగుంటుంది..
- ఉద్యోగ భద్రతకు ‘ కూటమి’ భరోసానిచ్చింది..
- పి.ఆర్.సి. పే స్కేల్ కు.. కమిషన్ ను నియమించాలి
- ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు డిమాండ్
కర్నూలు, న్యూస్ నేడు:గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు అభద్రత భావం ఉండేదని, వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టారని తీవ్ర ఆందోళనకు గురైన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వం నమ్మకం పెరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ. 6200 కోట్లు పైగా కేటాయించడం ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ లోని పొదుపు భవనంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ నాగరాజు అధ్యక్షతన శుక్రవారం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లుతోపాటు సహ చైర్మన్ శ్రీనివాస రావు అమరావతి జిల్లా కార్యవర్గంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్ప రాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల బకాయింపు చెల్లించేందుకు రూ. 6200 కోట్లు కేటాయించడం అభినదంనీయమని, దీంతో ఉద్యోగులకు భరోసా, నమ్మకం పెరిగిందన్నారు. ఈ నిధులలో రిటైర్డు పెన్షనర్లు కు కొంత కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని కోరారు.
ఎప్పటికప్పుడు డి.ఏ.లు చెల్లించాలి
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన జి.పి.ఎఫ్, ఏపీ జి.ఎఫ్, మెడికల్ తదితరవి ఇవ్వలేదని, డి.ఏ.లు కూడా పెండింగ్ పెట్టి వెళ్లిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఏలు చెల్లించిందని, ప్రస్తుతం 2024 జనవరి, జూలై, 2025 జనవరి డి.ఏ.లు మాత్రమే పెండింగ్ లో ఉందని, అవి కూడా త్వరగా ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఏ.లు ఎప్పటికప్పుడు చెల్లిస్తే సమస్య ఉండదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పి.ఆర్.సి. పే స్కేల్‌కు కమిషన్ ను నియమించండి
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించి పి.ఆర్.సి. పే స్కేల్ కు సంబంధించి ఇప్పటి వరకు కమిషన్ ను నియమించలేదని, ఈ విషయమై గత ప్రభుత్వానికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఐ.ఆర్., పిఆర్సి, అరియర్స్ 1.07.2018 నుంచి 31.12.2021 వరకు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ క్రమంలో పి.ఆర్.సి. కమిషన్ ను అధికారికంగా నియమించాలని ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఏపీ జేఏసీ కర్నూలుకు ప్రశంస..
ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ఒత్తిడి తీసుకువస్తామన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు… కర్నూలు జిల్లా కార్యవర్గంపై ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా.. వెంటనే కర్నూలు జిల్లా అధ్యక్షుడు నాగరాజు తమ దృష్టికి తీసుకొస్తున్నాడని, ప్రభుత్వ సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ వై. కృష్ణ, జనరల్ సెక్రటరి వెంకట రాజు, మహిళా సంఘం జిల్లా సెక్రటరి సహేరా భాను, రెవెన్యూ రాష్ట్ర ఆర్డనైజర్ సెక్రటరి రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు.
