NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అసెంబ్లీలో గంద‌రగోళం.. స‌భ నుంచి ఎమ్మెల్యేల స‌స్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యే పట్టుపడటంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభ నుంచి 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. బుధవారం ఉదయం సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం… తెలుగుదేశం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ సభ్యులు అదే సీన్ రిపీట్ చేశారు. దీంతో 10 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభా కార్యక్రమాలకు తెలుగు దేశం నేతలు అడ్డుపడుతున్నారని స్పీకర్ తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ బెందాలం, భవాని ఆదిరెడ్డి, చినరాజప్ప, జోగేశ్వరరావు, గద్దే రామ్మెహన్, రామకృష్ణబాబు, ఏలూరి సంభశివరావు, మంతెన రామరాజు, గోట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు.

                                               

About Author