కళా రత్న పత్తి ఓబులయ్యను అభినందించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆదివారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాటక రంగ విభాగంలో కళా రత్న అవార్డును పొందిన టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను, మాజీ రాజ్యసభ సభ్యులు టి జి వెంకటేష్ అభినందనలు తెలిపారు. టీజీవి కళాక్షేత్రం నాటక రంగానికి ఎన్నో సేవలు అందిస్తుంది అని ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ అన్నారు. పత్తి ఓబులయ్య సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కళారత్న బిరుదుతో పాటు హంస అవార్డు అందించారన్నారు. పత్తి ఓబులయ్య భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని టీజీ కోరారు. టీజీవి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు వివి రమణారెడ్డి, రాజశేఖర్, రాజారత్నం, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, గాండ్ల లక్ష్మన్న, పార్వతయ్య, తదితరులు పాల్గొన్నారు.