PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెస్ విజేతలకు ఎమ్మెల్యే ఆళ్ల నాని అభినందనలు..

1 min read

భారతదేశంలో పుట్టిన దీనిని అందరికీ అందుబాటులో కి తెస్తాం..

అకాడమి డైరెక్టర్ జి యోహాన్

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : ఇటీవల భీమవరం లో జరిగిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో  ఏలూరు అమలోద్బవి స్కూల్ చిన్నారులు  గంజి.అనురూప్ మోషే U-7 విభాగంలో 2వ స్థానం తో ఇప్పటి వరకు మొత్తం 55  బహుమతులు, గంజి.అభిషేక్ అవ్రహమ్ U-10 విభాగంలో 4వ స్థానం తో మొత్తం 81 బహుమతులు జిల్లా,రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించి అబ్రాహామ్& గ్యారీ కాస్పరోవ్ చెస్ అకాడమీకే కాక ఏలూరు నగరానికే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్ఛారాని  ఆళ్ళ. నాని  చిన్నారులను అభినందించి,తమ ప్రోత్సాహం అందిస్తామని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తండ్రి , అకాడమీ డైరెక్టర్ గంజి యోహనన్ మాట్లాడుతూ   చదరంగం మేధావుల క్రీడని, భారతదేశంలో పుట్టిన దీనిని అందరికీ అందుబాటులోకి తెస్తామని అన్నారు.

About Author